కాటన్‌ స్ఫూర్తితోనే జలసంరక్షణ ఉద్యమాలు

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు, సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతు ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తున్న మహానియుడు కాటన్‌ అని చంద్రబాబు కొనియాడారు. కాటన్‌ నీటి విలువ, గొప్పదనం తెలిసిన గొప్ప వ్యక్తి అందువల్ల ఆయన స్ఫూర్తితోనే నీరు-ప్రగతి వంటి జల సంరక్షణ ఉద్యమాలు ప్రారంభించామని పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా కాటన్‌ తీర్చిదిద్దారన్నారు. ధవళేశ్వరం వద్ద గోదావది నదిపై ఆనకట్ట నిర్మించి కాటన్‌ చరితార్థుడయ్యాడని వెల్లడించారు. ఆయన స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 70 శాతం పూర్తి చేశామని గుర్తుచేశారు. జులై నుంచి గ్రావిటీ ద్వారా పోలవరం నీరు అందిస్తామని చెప్పారు. పోలవరం పూర్తయితే ఏపీ దశ, దిశ మారిపోతుందని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధాన కల నిజం చేశామని.. కృష్ణా డెల్టాలో కరవు ఛాయలను తరిమికొట్టామని గుర్తుచేశారు. ఐదేళ్లలో ఏపీలో 23 జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేశామని చంద్రబాబు వెల్లడించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/