రేపు ఆత్మకూరు వెళ్లనున్న చంద్రబాబు

Chandrababu
Chandrababu

అమరావతి: టిడిపి శ్రేణులపై వైఎస్‌ఆర్‌సిఇప దాడులను నిరసిస్తూ ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట ‘ఛలో ఆత్మకూరు’కార్యక్రమాన్ని టిడిపి రేపు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రేపు ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. గుంటూరు, అరండల్ పేటలోని పునరావాస శిబిరానికి తొమ్మిది గంటలకు చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆత్మకూరు బయలుదేరి వెళతారని సమాచారం. ఇదిలా ఉండగా, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వైసీపీ నాయకుల వేధింపుల కారణంగా మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామం వదిలి వెళ్లిన వారిని తిరిగి గ్రామానికి వచ్చేలా చర్యలు ప్రారంభించారు. గ్రామ వదిలి వెళ్లినమాజీ సర్పంచ్ షేక్ చింతపల్లి జానీబాషా సహా మరో 18 మందిని తీసుకొచ్చారు. ఎటువంటి గొడవలు జరగకుండా పిన్నెల్లి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/