ఏపి గవర్నర్‌ను కలవనున్న చంద్రబాబు

వైఎస్‌ఆర్‌సిపి దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు

Chandrababu - AP Governor Biswabhusan Harichandan
Chandrababu – AP Governor Biswabhusan Harichandan

అమరావతి: టిడిపి అధినేత ఏపి గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ను కాసేపట్లో కలవనున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి నేతలు చేసిన దౌర్జన్యాలపై ఈసదర్భంగా చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. నామినేషన్లకు చివరి రోజైన నిన్న టిడిపి అభ్యర్థులపై పలుచోట్ల దాడి జరిగింది. నామినేషన్ పత్రాలను చించేశారు. బొండా ఉమ, బుద్దా వెంకన్నలపై దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దాడులకు సంబంధించిన సాక్ష్యాలను కూడా గవర్నర్ కు చంద్రబాబు సమర్పించనున్నట్టు సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/