ఏపిలో నూటికి నూరు శాతం మళ్లీ టిడిపినే

chandrababu
chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు గురువారం అర్థరాత్రి టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ టిడిపినే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఇందులో రెండో ఆలోచనలేదు. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు. కౌంటింగ్‌ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి. స్ట్రాంగ్‌ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి.అర్ధరాత్రి 12గంటలు అవుతున్నా ఇంకా 200 బూత్‌లలో పోలింగ్‌ సాగుతోంది. మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈపరిస్థితి కల్పించారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్‌ సరళిని కాపాడారు. ఓడిపోతున్నామనే భయంతో వైఎస్‌ఆర్‌సిపి పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడింది. ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం.ఎవరు ఎన్ని కుట్రలు చేసిన రాష్ట్ర ప్రజలు టిడిపి పక్షాన నిలిచారని చంద్రబాబు అన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/