ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

  Chandrababu Naidu
Chandrababu Naidu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఆ పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వరద నీటి నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సక్రమంగా వరద నిర్వహణ చేస్తే నీళ్లు వెనక్కి వచ్చేవా..? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ వరద నిర్వహణపై ఒక్క సమీక్ష అయినా చేశారా..? అని నిలదీశారు. ఇదేనా గేట్లను ఆపరేట్ చేసే విధానం..? అంటూ మండిపడ్డారు. 3 లక్షల క్యూసెక్కల నీటిని ముందే వదిలితే ఈ సమస్య ఉండేదికాదన్నారు. వ్యక్తిపై ద్వేషంతో వరదలతో ఆటలాడతారా..? అని ప్రశ్నించారు. తనపై ఉన్న అక్కసుతో జనాన్ని వరదల్లో ముంచేస్తారా? అని మండిపడ్డారు. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టడంలేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/