రాష్ట్రాని కాపాడే శక్తి ఒక్క టిడిపికే ఉంది

CM Chandrababu
CM Chandrababu

కర్నూలు: సిఎం చంద్రబాబు కర్నూలులో జరిగిన ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్ని మాట్లాడారు. టిడిపి విజయ రహస్యం 65 లక్షల మంది పసుపు సైనికులేనని ఆయన పునరుద్ఘాటించారు. జెండాలు మోసి ఎన్నికలప్పుడు పార్టీని గెలిపించేది కార్యకర్తలేనని, నాయకులంతా వారిని గౌరవించాలని అన్నారు. కార్యకర్తలు ప్రజల బాధ్యత చూసుకొంటే, వారి బాధ్యత పూర్తిగా తనదేనని భరోసా ఇచ్చారు. మెజారిటీ ఓట్లు తెప్పించిన నాయకులే తనకు సన్నిహితంగా ఉండగలుగుతారని, పని చేయని నేతలను పట్టించుకొనేది లేదని తేల్చి చెప్పారు. తమ పార్టీ మంత్రాలయం అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి చేయడం హేయమన్నారు. రౌడీయిజం చేస్తే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఒక్క తెదేపాకే ఉందన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/