చంద్రబాబుకు భద్రతపై హైకోర్టు తీర్పు
- ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్ఓ నే కొనసాగించాలి

అమరావతి: ఏపి మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు భద్రతకు సంబంధించిన కేసుపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని, చంద్రబాబు సీఎస్ఓను ప్రభుత్వం నియమించవచ్చని పేర్కొంది. చంద్రబాబు కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలనీ ఆదేశించింది. క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ విధులు ఎవరు నిర్వహించాలనే విషయంలో ఎన్ఎస్జీ, ఐఎస్ డబ్లూ కలిసి చర్చించుకోవాలని, మూడు నెలల్లోగా ఓ నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు 5 ప్లస్ 2 భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/