శివప్రసాద్‌కి నివాళులర్పించిన చంద్రబాబు

అప్పుడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నానని వెల్లడి

TDP MP Naramalli Sivaprasad
TDP Naramalli Sivaprasad

అమరావతి: టిడిపి సీనియర్‌ నేత, చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. నా బాల్యమిత్రుడు శివప్రసాద్ ఇంకా నా కళ్లముందే ఉన్నట్టుంది అంటూ ట్వీట్ చేశారు. మంత్రిగా, ఎంపీగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన టిడిపి నేత, సినీ, నాటక రంగ కళాకారుడు, దర్శకుడు అయిన శివప్రసాద్ స్వర్గస్తుడై ఏడాది గడచిందంటే నమ్మలేకపోతున్నానని విచారానికి లోనయ్యారు. శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళి అంటూ వ్యాఖ్యానించారు.

ఎంపీగా వ్యవహరించిన కాలంలో తన విలక్షణ వేషధారణలతో పార్లమెంటులో అనేక ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ శివప్రసాద్ మీడియా దృష్టిని ఆకర్షించేవారు. సినీ నటుడిగానూ ఎంతో గుర్తింపు అందుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. గతేడాది కిడ్నీ వ్యాధితో ఆయన కన్నుమూశారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/