ఈసీని నిలదీసిన సిఎం చంద్రబాబు

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు అమరావతిలో మీడియాతో మాట్లాడుతు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శంగా ఎన్నికలు నిర్వహంచాలని చెబుతుంటే మీకున్న అభ్యంతరమేంటని ఈసీని చంద్రబాబు నిలదీశారు. ఈవీఎంలలో నమోదువుతున్న ఓట్లకు వీవీప్యాట్‌కు స్లిప్పులకు తేడా ఉంటున్నందునే లెక్కించాలని చెబుతున్నామన్నారు. 50 శాతం స్లిప్పులు లెక్కించడానికి మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ఈసీని ప్రశ్నించారు. వీవీ ప్యాట్లపై ఇక్కడితో ఆగేది లేదని.. ఇతర రాష్ట్రాలకూ వెళ్లి అందరినీ చైతన్య పరుస్తామని చెప్పారు. దీనిపై మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు చంద్రబాబు వివరించారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించడానికి ఎన్నికల సంఘానికి అభ్యంతరమేంటి?ఆరు రోజులు పడుతుందని సుప్రీం కోర్టులో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్‌ స్లిప్పులకు తేడా ఉంటున్నందునే లెక్కించాలని కోరుతున్నాం. దీనిపై మళ్లీ సుప్రీంకోర్టుకు వెళతాం. . తరువాతి రోజు ఉదయం 4 గంటల వరకు ప్రజలు ఓటు వేశారు. ఇంత అవకతవకల ఎన్నికలను నేను ఎప్పుడూ చూడలేదు. అసలు దేశంలో ఎన్నికల సంఘం ఉందా? తప్పులను ఎత్తి చూపితే రాజకీయం చేస్తున్నారు. సందేహాలకు సమాధానం చెప్పడం మానేసి ఎదురుదాడి చేస్తున్నారు అని చంద్రబాబు అన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/