ఇది ప్రభుత్వ వైఫల్యమేనన్న చంద్రబాబు

నేలపై మృతదేహాన్ని పడేసిన సిబ్బంది

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మృతదేహం రెండు రోజులుగా పడి ఉన్న వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దీన్ని చూస్తుంటే హృదయం బద్దలవుతోందని అన్నారు. సిబ్బంది ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని… రెండు రోజులుగా నేలపై మృతదేహం పడి ఉన్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. శవాన్ని కుక్కులు పీక్కుతుంటున్నాయని తెలిపారు. మానవతా విలువలకు తూట్లు పొడిచేలా వ్యవహరించారని… ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. ఈ ఘటనను ఖండించడానికి కూడా మాటలు రావడం లేదని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/