చంద్రబాబు నచ్చినవాళ్లకు పోస్టింగ్‌లు ఇచ్చారు

Chandrababu , YS Jagan
Chandrababu , YS Jagan

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ ఈరోజు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతు సిఎం జగన్‌ పోలీస్‌ వ్యవస్థని దుర్వినియోగం చేశారని జగన్‌ విమర్శంచారు. వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. టిడిపి నేత కోడెల శివప్రసాద్‌ తన నియోజకవర్గంలో నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లారని, ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. అయితే కోడెల ఆయన చొక్కాను ఆయనే చించేసుకున్నారని జగన్‌ విమర్శించారు. గురజాలలో ఓట్లు వేయలేదని ముస్లింలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని జగన్‌ ఆరోపించారు. పూతలపట్టులో తమ అభ్యర్థి ఎంఎస్‌ బాబుని కొడితే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఒకే కులానికి చెందిన 40 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని విమర్శించారు. నచ్చినవాళ్లకు చంద్రబాబు పోస్టింగ్‌లు ఇచ్చారన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/