వైఎస్‌ఆర్‌సిపి నేతలపై చంద్రబాబు ఆగ్రహం

 chandrababu
chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు వైఎస్‌ఆర్‌సిపి నేతలపై సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పల్నాడు వైఎస్‌ఆర్‌సిపి బాధితుల కోసం అంటూ టిడిపి ఇటీవలే గుంటూరులో పునరావాసం శిబిరం ఏర్పాటు చేసింది. దీనికి ప్రతిగా వైఎస్‌ఆర్‌సిపి పిడుగురాళ్లలో పోటీ శిబిరాన్ని ఏర్పాటు చేసిందంటూ చంద్రబాబు మండిపడ్డారు. ‘గుంటూరులో మేం శిబిరం ఏర్పాటు చేశామని మీరు పిడుగురాళ్లలో కౌంటర్ శిబిరం ఏర్పాటు చేస్తారా? 5 ఏళ్ల క్రితం బాధితులకు ఇప్పుడు శిబిరం పెట్టడం ఎక్కడైనా ఉందా? నలుగురూ నవ్విపోతారు. అయినా ఈ విషయంలో నన్ను సవాల్ చేయడం ఏంటి? ఇది సవాళ్లు విసిరే సమయమా? లేక, బాధితులను ఆదుకునే సమయమా? అని అడుగుతున్నా’ అంటూ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/