బిజెపి దాడులను ఖండించిన చంద్రబాబు

ap cm chandrababu
ap cm chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు కోల్‌కతాలో బిజెపి దాడులను ఖండిస్తున్నట్లు ట్వీటర్‌ వేదికగా తెలిపారు. ఇప్పటికే ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో బెంగాల్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారని బిజెపి ఇప్పుడు తన అసలు రంగు చూపిస్తూ ప్రత్యక్ష దాడులు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమన్నారు.బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి సంఘీభావం తెలుపుతూ అమిత్‌ షా చర్యలను ఖండిస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోడి, అమిత్‌ షా చేస్తోన్న విధ్వంసక వ్యూహాలను ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉందన్నారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/