హడావుడిగా అంత్యక్రియలు జరపడం తప్పు

మా పార్టీ కోరడం వల్లే ఓం ప్రతాప్‌ మృతదేహానికి శవపరీక్ష

chandrababu-press-meet

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు తమ పార్టీ దళిత నేతలతో వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మృతి చెందిన దళిత యువకుడు ఓం ప్రతాప్‌ (28) ఘటనపై ఏపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ కోరడం వల్లే ఓం ప్రతాప్‌ మృతదేహానికి శవపరీక్ష చేశారని ఆయన చెప్పారు. ఆయన మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు జరపడం తప్పని, అలాగే, రహస్యంగా శవపరీక్ష జరపడం మరో తప్పని చంద్రబాబు అన్నారు. మృతుడి సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులే తీసుకున్నారని, ఈ కేసులో ఎలాంటి అవకతవకలు లేకపోతే ఈ పని ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. ఓం ప్రతాప్‌ ఫోన్‌కాల్‌ జాబితాను పోలీసులు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బెదిరింపులతో జరిగిన నేరాన్ని దాచాలని కొందరు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. చిత్తూరులో దళితులపై దాడులకు పెద్దిరెడ్డే కారణమని ఆయన అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/