జగన్‌ ప్రమాణస్వీకారానికి వెళ్లాలో.. వద్దో చంద్రబాబు

Chandrababu Naidu
Chandrababu Naidu

అమరావతి: ఏపి సిఎంగా వైఎస్‌ జగన్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారానికి రావల్సిందిగా జగన్‌ చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. అయితే విషయంపై ఈరోజు టీడీఎల్పీ సమావేశలో పార్టీ ఎమ్మెల్యెలు, ఎంపిలతో చర్చించిన చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. కాగా పార్టీ తరపున ప్రతినిధులను పంపాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం జగన్‌ నివాసానికి ఇద్దరు టీడీపీ నేతలు వెళ్లనున్నారు. జగన్‌కు ఈ బృందం శుభాకాంక్ష లేఖని ఇవ్వనుంది. చంద్రబాబును ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/