సివిల్స్‌ ర్యాంకులు సాధించిన వారికి చంద్రబాబు అభినందనలు

chandra babu naidu
chandra babu naidu, ap cm


అమరావతి: సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన తెలుగు తేజాలకు ఏపి సియం చంద్రబాబు అభినందనలు తెలిపారు. దేశానికి అత్యున్నత స్థాయి అధికారులను అందిస్తున్న ఘనత తెలుగు వారిదేనని కొనియాడారు. ఈ సారి కూడా సివిల్స్‌కు ఎంపికైన వారిలో 40 మంది తెలుగువారే కావడం గర్వకారణమని, జాతీయస్థాయిలో తొలి 100 ర్యాంకులలో ఐదుగురు తెలుగువారే ఉండడం అన్నిటికన్నా విశేషమని చంద్రబాబు ప్రశంసించారు. సివిల్స్‌లో ఎంపికైన తెలుగు యువతీ యువకుల్ని అమరావతికి ఆహ్వానించి తగిన రీతితో సత్కరించాలని సియం అధికారులకు సూచించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి వికారి నామ సంవత్సరంలో శుభం కలగాలని సియం చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజల సంతోషమే తమ ధ్యేయమని, సంతృప్తి, సుఖశాంతులతో ప్రజలంతా గడపాలనే ఆశయంతో ప్రభుత్వం పని చేస్తుందని చంద్రబాబు అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/