టిడిపి గెలుపు 1000 శాతం తథ్యం

CM Chandrababu
CM Chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ఈరోజు టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఏపిలో ప్రతి సర్వే గెలిచేది టిడిపియే అన్నాయని, టిడిపి గెలుపు 1000 శాతం తథ్యమని చంద్రబాబు థీమా వ్యక్తం చేశారు. తప్పకుండా 110-140 సీట్లు టిడిపి సాధిస్తుందనేది సర్వత్రా అభిప్రాయమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికిఏ టిడిపి పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల తమ గెలపు ఏకపక్షం అయ్యిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టిడిపి గెలుపును అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారని, అయినా వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించారని, ఏపీలో 8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్రలు చేశారని తెలిపారు. సకాలంలో స్పందించి ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేశామన్నారు. ఐపీ అడ్రస్‌లు ఇవ్వకుండా ఓట్ల దొంగలను కాపాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పోలింగ్ రోజు ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించేలా చేశారని, మిషన్‌ రిపేర్ వస్తే.. కొత్త మిషన్ పెట్టాలని పట్టుబట్టామని చంద్రబాబు తెలిపారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/