ఏపికి రావాల్సిన పెద్ద పరిశ్రమలు వెనక్కిపోయాయి

పెట్టుబడులను, ఉద్యోగాలను మళ్ళీ ఏ విధంగా తేగలం?

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటం వల్ల రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నిధులు ఆగిపోతాయంటూ సిఎం చేస్తున్న వ్యాఖ్యలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. విశాఖలో రూ.70,000 కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలతో రావాల్సిన అదానీ సంస్థ, తిరుపతికి రావాల్సిన రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, అమరావతికి రావాల్సిన సింగపూర్ కన్సార్టియం వెనక్కి పోయాయని విమర్శించారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా వంతు వచ్చిందని, ఆసియన్ పేపర్ మిల్స్ ను కూడా తరిమేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడితే ఎంపీలతో ఒత్తిడి చేయించో, కేంద్రానికి లేఖలు రాసో, ఏపీకి రావాల్సిన రూ.4 వేల కోట్లు అడిగి తెచ్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, మీ బెదిరింపులకు భయపడి పారిపోయిన ఈ కంపెనీలను, పెట్టుబడులను, ఉద్యోగాలను మళ్ళీ ఏ విధంగా తేగలం? అంటూ సీఎం జగన్ ని పరోక్షంగా ప్రశ్నించారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/