టిడిపి కార్యకర్తలపై 640 దాడులు జరిగాయి

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులపై మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని… వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడిపి కార్యకర్తలపై 640 దాడులు జరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులను బనాయిస్తూ, బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని అన్నారు. దాడులపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పారు.
వైఎస్‌ఆర్‌సిపి మంత్రులు బూతుల మంత్రులుగా తయారయ్యారని దుయ్యబట్టారు. వైయస్ వివేకాను ఇంట్లోనే హత్య చేసి, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలతో ఆడుకుంటే వైఎస్‌ఆర్‌సిపి పతనం తప్పదని చెప్పారు. కర్నూలు జిల్లాలో దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులకు మొదటి నుంచి అండగా ఉన్నది టిడిపినే అని చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/