సవాల్‌లు విసురుకున్న చంద్రబాబు, జగన్‌

CM Jagan , Chandrababu
CM Jagan , Chandrababu

అమరావతి: ఏపి అసెంబ్లీలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 2014 నుండి రైతులకు సున్నా వడ్డీ పథకం అమలు చేశామంటూ టిడిపి ఎమ్మెల్యె రామానాయుడు అన్నారు. దీనికి సిఎం జగన్‌ స్పందించారు. 2014 నుంచి 2019 వరకు సున్నా వడ్డీ పథకం కింద ఎంత ఇచ్చారో చెప్పాలని చంద్రబాబుకు సీఎం జగన్‌ సవాల్‌ విసిరారు. రికార్డులు తెప్పిస్తా చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని జగన్ సవాల్ విసిరారు.

జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటరిచ్చారు. విత్తనాలు ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విత్తనాలు కూడా ఇవ్వలేని మీరు ఐదేళ్లలో ఏం చేస్తారు? అని అడిగారు. జీడీపీ లెక్కలు ఆర్థికమంత్రి, తాను రాసేవి కావన్నారు. ఆ విషయం తెలియకుంటే ఇంట్లో కూర్చుని లెక్కలు రాసుకోండని వ్యాఖ్యానించారు. మా హయాంలో వ్యవసాయంలో దేశంలోనే నెంబర్‌ వన్‌‌గా ఉందంటూ చంద్రబాబు వివరించారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/