ప్రాజెక్టులపై జగన్‌ వర్సెస్‌ చంద్రబాబు విమర్శలు

chandra babu VS jagan
chandra babu VS jagan

విజయవాడ: ఏపిలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రాజెక్టులపై చంద్రబాబు, జగన్‌ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ వెళ్లడాన్ని టిడిపి తప్పుపట్టిన విషయం తెలిసిందే, ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు అధికారంలో ఉండి కూడా అప్పుడు గాడిదలు కాశారా? అని జగన్‌ ప్రశ్నించారు. తెలంగాణ నుంచి గోదావరి నది పారుతుందని, ఆ రాష్ట్ర సియం కేసిఆర్‌..శ్రీశైలంకు నీళ్లు ఇస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళితే తప్పేంటని జగన్‌ సమర్ధించుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం వెళ్లినట్లు వెల్లడించింది.
జగన్‌ మాట్లాడిన తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ అనుభవం అంత వయసు జగన్‌కు ఉండదని కౌంటర్‌ వేశారు. దీంతో జగన్‌ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. కేసిఆర్‌ హిట్లర్‌ అని, కాళేశ్వరం వస్తే తెలంగాణ, ఆంధ్ర పాకిస్థాన్‌ మాదిరి అవుతాయని జగన్‌ చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల సమస్య కొన్ని సంవత్సరాలుగా నడుస్తుందని, నీళ్లపై టిడిపి పోరాటాన్ని వివరించారు. గట్టిగా మాట్లాడితే తాము భయపడిపోతామని అనుకుంటున్నారని, ఐదు కోట్ల ప్రజలు ఆలోచిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/