పార్టీని వీడని కార్యకర్తలకు పాదాభివందనం

మహానాడులో ప్రసంగించిన చంద్రబాబు

chandrababu-speech-in-mahanadu

అమరావతి: టిడిపి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు కార్యక్రమం ప్రారంభమయింది. కరోనా కారణంగా ఈ ఏడాది వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మహానాడు నిర్వహిస్తున్నారు. ముందుగా విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ మృతులకు సంతాపం ప్రకటించిన మహానాడు… బాధితులకు పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..టిడిపి 38 ఏళ్ల చరిత్రలో 22 ఏళ్లు అధికారంలో.. 16 ఏళ్లు ప్రతిపక్షంలో ఉందని అన్నారు.
‘సమాజమే దేవాలయంప్రజలే దేవుళ్లు అనే బాటలో నడిచాం. కార్యకర్తలు భుజాలు అరిగిపోయేలా టిడిపి జెండాలు మోశారు. టిడిపి పథకాలు దేశానికే మార్గదర్శకమయ్యాయి. కుటుంబ సభ్యులు హత్యకు గురైనా పార్టీని వదలలేదని కార్యకర్తలు చెప్పారు. కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేనివి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వైఎస్‌ఆర్‌సిపి నేతలు టిడిపి కార్యకర్తలని దెబ్బతీశారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఉన్మాదుల మాదిరిగా వ్యవహరించారు. చేయని తప్పుకు టిడిపి కార్యకర్తలు జైళ్లకు వెళ్తున్నారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారు. ఆర్థికంగా కుంగదీసినప్పటికీ పార్టీని వీడని కార్యకర్తలకు పాదాభివందనం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/