పార్టీ ముఖ్య నేతలతో బాబు టెలికాన్ఫరెన్స్‌

chandra babu naidu
chandra babu naidu

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు యూరప్‌ పర్యటనలో ఉన్నారు. ఐతే మరికాసేపట్లో ఆయన పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలందరూ చంద్రబాబు నివాసంలో సమావేశం కానున్నారు. వారితో యూరోప్‌ నుంచి టెలికాన్పరెన్స్‌ ద్వారా చంద్రబాబు అందుబాటులోకి రానున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, బిజెపిలో ఎంపీల చేరిక తదనంతర పరిణామాలపై ఆయన చర్చించనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/