ఐటి దాడులకు నిరసనగా చంద్రబాబు ధర్నా

chandra babu naidu, bonda uma
chandra babu naidu, bonda uma


విజయవాడ: ఏపిలో టిడిపిపై అన్యాయంగా ఐటి దాడులు చేస్తున్నారని, దానికి నిరసనగా ఇవాళ విజయవాడలో ఏపి సియం చంద్రబాబు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో టిడిపి అభ్యర్ధులు, మద్దతు దారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టిడిపి అభ్యర్ధులు, మద్దతుదారులపై ఐటిశాఖ దాడులు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ధర్నాకు దిగారు. ప్రధాని మోది ఆదేశాల మేరకే ఐటి సోదాలు జరుగుతున్నాయని బాబు ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నపుడు ఈసి మార్గదర్శకాల ప్రకారం వెళ్లాలని, ఒకే పార్టీని టార్గెట్‌ చేసి అన్యాయంగా దాడులు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
కడప జిల్లాలో టిడిపి నేత, సియం రమేశ్‌ ఇంట్లో ఇవాళ ఐటి శాఖ సోదాలు చేసింది. సుమారు 50 మంది పోలీసులు ఆయన ఇంట్లోకి వెళ్లి సోదాలు చేశారు. దీంతో రమేశ్‌ ఆగ్రహానికి గురయ్యారు. సెర్చ్‌ వారెంట్‌తో వచ్చారా అని పోలీసులను సియం రమేశ్‌ నిలదీశారు. జిల్లా ఎస్పి ఇచ్చిన ఆదేశాలతో దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/