అమరావతి నిర్మాణ పనులపై సియం సమీక్ష

chandra babu naidu, ap cm
chandra babu naidu, ap cm


అమరావతి: ఏపి రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ నిర్మాణ పనులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సియం ఆదేశించారు. కొత్త శాసనసభ కొలువుదీరాక నూతన సభ్యులలు రాజధానిలో ఉండేందుకు భవనాలు సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. వర్షాకాలం నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్లను న్యాయ వివాదాలు లేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు. రహదారులు సిద్ధమైతే అమరావతికి రాకపోకలు పెరుగుతాయని బాబు అన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/