ఈసిని కలవడానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు

chandra babu naidu, ap cm
chandra babu naidu, ap cm


అమరావతి: ఏపి సియం చంద్రబాబు ఈ రోజు ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఏపిలో గురువారం ఎన్నికలు జరిగిన తీరుపై ఈ మధ్యాహ్నం సిఈసిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఈవిఎంలు పనిచేయకపోవడం, కొన్నిచోట్ల పోలింగ్‌ మధ్యాహ్నం వరకు ప్రారంభం కాకపోవడం, అర్థరాత్రి వరకు పోలింగ్‌ నిర్వహించాల్సి రావడం వంటి దుస్థితులపై చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. వీవీప్యాట్‌ల లెక్కింపుపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు రివ్యూ పిటిషన్‌ వేయనున్నారు. వీవీప్యాట్‌లోని స్లిప్పులు లెక్కింపునకు ఆరు రోజుల సమయం పడుతుందని ఈసి సుప్రీంకు నివేదించిన సమాధానాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. సియం వెంట మంత్రులు, సిట్టింగ్‌ ఎంపిలు ఢిల్లీకి పయనమయ్యారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/