టిడిపికి చల్లా గుడ్‌బై

వైకాపాలో చేరేందుకు రంగంసిద్ధం

CHALLA RAMAKRISHNA REDDY
CHALLA RAMAKRISHNA REDDY

అవుకు: 2014 ఎన్నికల్లో బనగానపల్లె టిడిపి అభ్యర్థి బిసి జనార్థన్‌రెడ్డి గెలుపునకు కృషిచేసిన మాజీ శాసనసభ్యుడు చల్లా రామక్రిష్ణారెడ్డి టిడిపి, సివిల్‌ సప్ల§్‌ు చై ర్మన్‌ పదవికి సోమవారం రాజీనామాచేసి వైఎ స్సార్సీకి జైకొట్టడంతో కర్నూలు జిల్లా బనగాన పల్లె రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి తరుపున నిలబడి గెలుపునకు బాటలువేసిన చల్లా.. నేడు టిడిపికి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధమయ్యారు. రాజకీయాల్లో 36 సంవత్సరాల విశేష అను భవం కలిగిన రాజకీయ మేధావి రామక్రిష్ణారెడ్డికి బనగానపల్లె నియోజకవర్గంలో తనకంటూ ఓ బలమైన వర్గం ఉండటంతోపాటు మూడుసార్లు గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందటం జరిగింది. తన రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా టిడిపి తరుపున పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించి నియోజకవర్గంలో మచ్చలేని నాయకుడిగా స్థానాన్ని సంపాదించు కొని రాజకీయాల్లో మంచిగుర్తింపు తెచ్చుకున్నా డు. ఆనాటి నుంచి రెండుసార్లు కోవెలకుంట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది రాజకీ యాల్లో పట్టునిలుపుకున్నారు. కోవెలకుంట్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆయన చేసిన అభివృద్ధిపై ఇప్పటికీ చల్లా అంటే ప్రజలు ఇష్టపడతారు. 2014 ఎన్నికల్లో టిడిపిలో చేరి టిడిపి అభ్యర్థి బిసి జనార్ధన్‌ రెడ్డి గెలుపునకు కుృషి చేయటంతో అదిష్టానం ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి దాటవేయటంతో కొంతమేర పార్టీపై అసహనంతో వున్న చల్లాను ముఖ్యమంత్రి నాలుగునర్ర సంవత్సరాలు గడిచిన తరువాత ఆర్‌టిసి రీజనల్‌ పదవి ఇవ్వటంతో దానిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో టిడిపి అధినేత తిరిగి రాష్ట్రసివిల్‌ సప్ల§్‌ు చైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డిని నియమించటం జరిగింది. అయితే ఎన్నికల్లో తన సహాయంతో గెలుపొందిన బిసి జనార్ధన్‌ రెడ్డి తనపై విముఖంగా వుండటం, తాను చేసే పనులకు ఆటంకం కలిగిస్తు వుండటంతో విసుగు చెంది టిడిపి పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది. అలాగే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌సి పదవి ఇస్తానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైన బనగానపల్లె నియోజకవర్గంలో ఈ సారి జరిగే ఎన్నికల్లో టిడిపి పార్టీ తీవ్రనష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా వున్నాయని రాజకీయ విశ్లేషకులు, కార్యకర్తలు, ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి నుంచి చల్లా బయటికి రావడంతో టిడిపి శ్రేణుల్లో నిరుత్సాహం కలుగగా వైఎస్‌ఆర్‌ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సహాలు నెలకొన్నాయి.