జగన్‌తో సమావేశమైన కేంద్ర మంత్రి

cm Jagan - Minister Giriraj Singh
cm Jagan – Minister Giriraj Singh

అమరావతి: ఏపి సిఎం జగన్‌తో కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో… ఇరువురు పలు అంశాలపై చర్చించారు. అంతకు ముందు కనకదుర్గ అమ్మవారిని గిరిరాజ్ సింగ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఈవో సురేశ్ బాబు ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నంత కాలం ధర్మం కాపాడబడుతుందని చెప్పారు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/