ఏపీకి మూడు అవసరమా?.. రాంమాధవ్

రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు

ram madhav
ram madhav

అమరావతి: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్  ఏపీకి  మూడు రాజధానులు అవసరమా? అని ఎద్దేవా చేశారు. అయితే, రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పారు.టీడీపీ హయాంలో అమరావతిలో జరిగిన అవినీతిని ప్రశ్నించామని… ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో జరిగే అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ పోరాడాలని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంమాధవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యబద్ధంగా వీధుల్లో నిలబడి పోరాటం చేసినప్పుడే ముందుకు వెళ్లగలుగుతామని రాంమాధవ్ తెలిపారు. ప్రజలకు అండగా నిలబడే పార్టీగా ఎదగాలని క్యాడర్ కు హితబోధ చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తులను సంఘర్షణ వైఖరితో ఎదుర్కోవాలని చెప్పారు. అధికార పార్టీ దురంహంకారాన్ని ఢీకొనాలని అన్నారు. రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగాలని మార్గనిర్దేశం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/