జగన్‌ ప్రమాణస్వీకారానికి వచ్చేది వీరే!

Jagan
Jagan

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ ఏపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు అని ఏర్పాట్లు పూర్తి చేశారు. జగన్‌ గురువారం(రేపు) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలోమధ్యాహ్నం 12.23 గంటల ముహుర్తానికి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారానికి పలు రాష్ట్రాల నుండి సిఎంలు, రాజకీయ పార్టీల అధ్యక్షులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు రానున్నారు. వీరందరిని జగన్‌ స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానం పలుకుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రధానిమోడిని, సిఎం కెసిఆర్‌ను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
తాజాగా బిహార్ సిఎం నితీశ్ కుమార్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, డీఎంకే అధినేత స్టాలిన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సినీనటుడు చిరంజీవి, కాంగ్రెస్ నేత కేవీపీ రాంచందర్‌రావు, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసిన జగన్ తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. మోహన్ బాబు, బాల‌కృష్ణ‌, అక్కినేని నాగార్జునతో పాటు టాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు తెలిసింది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/