సుజనా చౌదరి నివాసాల్లో మళ్లీ సీబీఐ దాడులు!

Sujana Chowdary
Sujana Chowdary

హైదరాబాద్‌: టిడిపి నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మళ్లీ ఈరోజు దాడులు నిర్వహించింది. హైదరాబాద్ లోని సుజనాకు చెందిన మూడు నివాసాలకు చేరుకున్న సీబీఐ బృందాలు అణువణువను గాలిస్తున్నాయి. సుజనా చౌదరి బ్యాంకులకు దాదాపు రూ.6,000 కోట్లు ఎగ్గొట్టారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ దాడులు నిర్వహించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.201819 మధ్యకాలంలో సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు తెలంగాణతో పాటు ఏపీలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో పలుమార్లు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీబీఐ దాడులపై సుజనా చౌదరి ఇంతవరకూ స్పందించలేదు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/