కారు ఢీకొని ఇద్దరు కూలీలు మృతి

road accident
road accident

జగ్గయ్యపేట: ఈరోజు ఉదయం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు ప్లైఓవర్‌పై రహదారి మరమ్మతులు చేస్తున్న కూలీలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళ కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళకు తీవ్రగాయలయ్యాయి. అయితే విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు అతివేగంగా వెళుతున్న కారు ఢీకొనడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మృతులు జగ్గయ్యపేట మండలంలోని గండ్రాయి గ్రామానికి చెందిన మంగతాయారు(60), ఉషారాణి(35)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఉమను 108 అంబులెన్స్‌లో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/