ఏపి కేబినెట్ చ‌ర్చాంశాలు

AP CABINET MEETING
AP CABINET MEETING

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం… మంత్రుల ప్రమాణం, శాఖల కేటాయింపు పూర్తికావడంతో… ఏపిలో తొలి కేబినెట్ సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ విలీనం అంశాన్ని అజెండాలో చేర్చారు. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలకు ప్రారంభించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీఇచ్చిన జగన్… కార్యాచరణ ప్రారంభించారు.

AP CABINET MEETING
AP CABINET MEETING

విలీనం ముందు చేయాల్సిన ప్రక్రియపై చర్చించనున్నారు. అధ్యయన కమిటీని నియమించి సాధ్యాసాధ్యాలపై నివేదిక తీసుకోనున్నారు.తాడేపల్లిలోని సీఎం నివాసంలో జరిగే సమావేశంలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, ఉన్నతాధికారులు సహా ఎంప్లాయిస్ యూనియన్, కార్మిక పరిషత్, పలు సంఘాల నేతలు పాల్గొంటారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై అధికారులు, కార్మిక సంఘాల నేతల సూచనలు తీసుకోనున్నారు.

AP CABINET MEETING
AP CABINET MEETING

విలీన ప్రక్రియ పూర్తయ్యేవరకు కొత్త బస్సుల కొనుగోలు కోసం నిధులు కేటాయించడం… ఎంవీటాక్స్ మినహాయింపు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. అనంతరం మంత్రివర్గ సమావేశానికి వెళ్తారు.తమ డిమాండ్ల పరిష్కారంపై సీఎంతో సమావేశంలో స్పష్టమైన హమీ వచ్చిన తరువాత… సమ్మె విరమణపై కార్మిక సంఘాలు ప్రకటన చేయనున్నాయి.