విజయసాయిరెడ్డి గారు మీ ప్రతాపం ట్విట్టర్‌లో కాదు

సీఎం జగనన్న మద్యం దుకాణం ముందు నిలబడి చూపించు

buddha venkanna
buddha venkanna

అమరావతి: వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డిపై టిడిపి నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్‌ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి గారు మీ ప్రతాపం ట్విట్టర్‌లో కాదు జగనన్న మద్యం దుకాణం ముందు నిలబడి చూపించండని సవాల్‌ విసిరారు. మద్యపాన నిషేధం పేరుతో కోట్లు కొల్లగొడుతున్న వైఎస్‌ జగన్‌ గారిది బిజినెస్‌ మైండ్‌ కాదు క్రిమినల్‌ మైండు అని విమర్శించారు. ఇంకా మరో ట్వీట్‌లో ప్రభత్వ దుకాణాల పేరుతో బ్రాండ్ల దందా మొదలు పెట్టిన మీరు మద్యపాన నిషేదం గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అమలై అందరూ తాగడం మానేసారని డప్పు కొడుతున్నారు, మరి మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెగుతుందని విజయసాయిరెడ్డి అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/