విజయసాయిరెడ్డిపై బుద్దా విమర్శలు

buddha venkanna
buddha venkanna

అమరావతి: టిడిపి ఎమ్మల్సీ బుద్దా వెంకన్న వైఎస్‌ఆర్‌సిపి సభ్యుడు విజయసాయిరెడ్డిపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైయస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు సంభ్రమాశ్చర్యాలను లోనయ్యానని 420 తాతయ్య విజయసాయిరెడ్డి చెబితే అర్థం చేసుకోలేకపోయామని అన్నారు. ‘మీరు దొంగ లెక్కలే కాదు… మర్డర్ డైరెక్షన్ లో కూడా ఆరితేరిపోయారని అర్థమైంది. ఆ హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య వెనుక మర్మమేంటో చెప్తావా తాతయ్యా?’ అని ట్వీట్ చేశారు. ఇంతకీ బాబాయ్ ను ఎవరు చంపారు? అని ప్రశ్నించారు. #WhoKilledBabai  అనే ట్యాగ ను జతచేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/