చంద్రబాబుపై బురద జల్లితే ఆకాశంపై ఉమ్మివేసినట్లే

buddha venkanna
buddha venkanna, tdp mlc


అమరావతి: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌ సుమారు రూ. 8వేల కోట్లు ఖర్చు చేశారని టిడిపి అధికార ప్రతినిధి ,ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఆర్ధిక నేరస్థుడైన జగన్‌ దగ్గర విజయసాయిరెడ్డి, రామచంద్రయ్య శకుని లాంటి వారిని విమర్శించారు. అమరావతిలో బుద్ధా మీడియాతో మాట్లాడారు. సియం చంద్రబాబుపై బురద జల్లితే ఆకాశంపై ఉమ్మివేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియని రామచంద్రయ్యను వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు కూడా గుర్తుపట్టడం లేదని ఎద్దేవా చేశారు. నిజాయితీ లేని అలాంటి వ్యక్తుల వల్లే రాజకీయాలంటే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/