అనంతపురంను స్మార్ట్‌సిటీగా మారుస్తాం

Botsa Satyanarayana
Botsa Satyanarayana

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ శాఖమంత్రి బొత్స సత్యనారయణ అనంతపురం నగారాన్ని స్మార్ట్‌సిటీగా మారుస్తామని ప్రకటించారు. ఇంచార్జి మంత్రి హోదాలో అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి బొత్స..మంగళవారం ఉదయం అనంతపురం అర్భన్‌ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డితో కలిసి అనంత నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో బిందెలకాలనీ, ఎస్సీకాలనీ, గుత్తి రోడ్డు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలయొక్క సమస్యలను విన్న బొత్ససానుకూలంగా స్పందించారు అనంతరం నారయణపురం పంచాయతీలో డంపింగ్‌ యార్డు స్థలాన్ని పరిశీలించారు. కాగా అనంతపురంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ మంజూరు చేస్తామని బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
తాజా క్రీడా వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/