అర్హులైన పేదలకు ఇంటి వద్దకే పెన్షన్లు పంపించాం

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: అర్హులైన పేదలకు ఇంటి వద్దకే పెన్షన్లు పంపించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ ఇస్తామని చెప్పారు. 6 లక్షలా 11 వేల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చామని తెలిపారు. 7 లక్షల పెన్షన్లు తొలగించారంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని బొత్స ఖండించారు. నారావారిపల్లిలో కూడా పెన్షన్ల జాబితా పెట్టామని మంత్రి బొత్స తెలిపారు. ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/