ఇళ్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడం బాధకరం

Bonda Uma
Bonda Uma

విజయవాడ: సిఎం జగన్‌ ఆధ్వర్యంలోని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రద్దు పద్దుల్లో ఘనత వహించిందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఎద్దేవా చేశారు. అభివృద్ధి పనులనే కాదని, చివరికి పేదలకు ఇచ్చే ఇళ్ల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ రద్దుల పద్దును అమలు చేస్తూ తన తీరును చాటుకుంటోందని విమర్శించారు. గజం వంద రూపాయలకే రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబరు 74ను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ అర్బన్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రమణారావు ఈరోజు విజయవాడలో ప్రారంభించిన రిలే దీక్షను ఉమ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్లకు బ్యాంకు రుణాలు కూడా మంజూరైన తరుణంలో రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడం దారుణమన్నారు. పేద ప్రజలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను మూసివేశారని గుర్తు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలని హితవు పలికారు.


తాజా జాతీయ వార్తల కసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/