ప్రభుత్వం చేయాల్సిన పనిని చంద్రబాబు చేస్తున్నారు

ఆళ్ల నాని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు

bonda umamaheswara rao
bonda umamaheswara rao

అమరావతి: కరోనాపై ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని టిడిపి నేత బోండా ఉమ విమర్శించారు. ఈ రోజు కరోనాపై ప్రభుత్వం చేయాల్సిన పనిని చంద్రబాబు చేస్తున్నారని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో కరోనాను ఎలా అదుపు చేయాలనే విషయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు నిపుణులతో మాట్లాడుతున్నారని వెల్లడించారు. కానీ, కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం చేతగాక చేతులు ఎత్తేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా రోగుల పరిస్థితి ఘోరంగా ఉందని, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపిలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం నిజం కాదా? అని బోండా ఉమ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ వైఫల్యంతో ఏపిలో కరోనా సామాజిక వ్యాప్తిగా మారిందని ఆరోపించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/