మరో 15 మృతదేహాల వెలికితీత

Boat  immersed in Godavari Incident
Boat immersed in Godavari Incident

Rajamahendra varam: రాజమండ్రి –  తూర్పుగోదావరి జిల్లా పాపికొండల టూర్‌లో పడవ మునిగి ప్రమాదంలో మరణించిన మరో 15 మృతదేహాలను వెలికితీశారు.  . దేవీపట్నంలో 10, ధవళేశ్వరం వద్ద రెండు… పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో మూడు మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటివరకు మొత్తం 23 మృతదేహాలను వెలికితీశారు. మరో 24 మంది కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.  కాగా,  నల్గొండ జిల్లాకు చెందిన  పాశం తరుణ్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. మృతుడి స్వస్థలం నల్లగొండ జిల్లా అనుముల మండలం రామడుగు గ్రామం. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.  మృతుడి బంధువులకు శవాన్ని అప్పగించనున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ తరుణ్ మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లను చేస్తున్నారు.