బోటులో ఎక్కువ మంది తెలంగాణ వారే…

Boat Accident-

East Godavari District (AP): తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటులో ప్రయాణిస్తున్నవారంతా ఎక్కువమంది తెలంగాణకు చెందినవారేనని తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి 22మంది, వరంగల్‌ నుంచి15మంది పాపికొండలు విహార యాత్రకు బయల్దేరివెళ్లినట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదం నుంచి వరంగల్‌ కాజీపేటకు చెందిన గొర్రె ప్రభాకర్‌ సహా పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. అలాగే ఎనిమిది మందికి సీరియస్‌గా ఉండటంతో వారిని ట్రాక్టర్‌లో దేవీపట్నానికి తరలిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనలో బోటు డ్రైవర్లు సంగాడి నూకరాజు, తామరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు.