సీఏఏను సమర్థిస్తూ కడపలో బిజెపి భారీ ర్యాలీ

bjp rally
bjp rally

కడప: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీఏఏను సమర్థిస్తూ శనివారం నగరంలో బిజెపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ శకావత్‌ ఈ ర్యాలీని ప్రారంభించారు. కడప నగరంలో మున్సిపల్‌ మైదానం నుంచి కూడలి వరకు ర్యాలీ సాగనుంది. సీఏఏ చట్టంపై అవగాహన తీసుకువచ్చేందుకు ఈ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు బిజెపి వెల్లడించింది. ఈ ర్యాలీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, మాజీ మంత్రి ఆదినారయణ రెడ్డి ఇతర బిజెపి నాయకులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/