కొడాలి నానిపై బిజెపి నేతలు ఆగ్రహం

నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్

Bharatiya Janata Party
Bharatiya Janata Party

అమరావతి: విశాఖలో బిజెపి నేత విష్ణుకుమార్‌ రాజు ఏపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కొడాలి నాని మాటలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని అన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, కడప జిల్లాలో బిజెపి నిర్వహించిన ధర్నాలో బిజెపి ఏపీ ఉపాధ్యక్షుడు ఆది నారాయణ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతిలో నిర్వహించిన ధర్నాలో భానుప్రకాశ్ రెడ్డి, సోమంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడలోనూ బిజెపి నేతలు ధర్నాలు నిర్వహించారు. విజయవాడలో బిజెపి నేతల అరెస్టుతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్లు ఆర్డీవో కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. హిందూ సమాజాన్ని కొడాలి నాని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/