స్నాతకోత్సవంలో పాల్గొన ఏపి గవర్నర్‌

Biswabhusan Harichandan
Biswabhusan Harichandan

కాకినాడ: ఏపి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కృష్ణానది వరద ఉద్ధృతిని విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. రాజభవన్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టరులో కాకినాడ వెళ్లే ముందు వరద ప్రభావ ప్రాంతాల్లోని స్థితిగతులను పరిశీలించారు. కృష్ణానదిలో వరద ఉద్ధృతి గురించి తాజా సమాచారాన్ని అధికారులు గవర్నర్‌కు వివరించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు ఎంత పరిమాణంలో నీరు విడుదలవుతోందనేది గణాంకాలతో సహా వివరించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని చెప్పారు.
అనంతరం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జవహార్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏడో స్నాతకోత్సవంలో బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొన్నారు. కులపతి హోదాలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ ఆవరణలో ఆయన మొక్కనాటి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. స్నాతకోత్సవం సందర్భంగా బీహెచ్‌ఈఎల్‌ మాజీ సీఎండీ ప్రసాదరావుకు ఆయన డాక్టరేట్‌ ప్రదానం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/