టిడిపిని వీడిన నలుగురు రాజ్యసభ సభ్యులు!

rajya sabha MPs
rajya sabha MPs


న్యూఢిల్లీ: టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. తమను ప్రత్యేక గ్రూప్‌గా పరిగణించాలని , ఎంపీలు సియం రమేశ్‌, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు , టిజి వెంకటేశ్‌ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ అందజేశారు. టిడిపిని విభేదించి బయటకు వచ్చామని, ఆ పార్టీతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ లేఖలో ఎంపీలు పేర్కొన్నారు. టిడిపి పార్టీ నుంచి మాత్రమే దూరమయ్యామని, ఎంపీలుగా మిగిలిన కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని ఎంపీలు తమ లేఖలో వివరించారు. ప్రస్తుతం ఆ పార్టీకి తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రమే మిగిలారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/