ఈ ఐదేళ్లు ప్రజల రుణం తీర్చుకుంటా..

bhoomana karunakar reddy
bhoomana karunakar reddy


తిరుపతి: తిరుపతిలో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే భూమాన కరుణాకర్‌రెడ్డి విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ.. మంత్రి పదవిపై తనకు ఆశ లేదని , తనకు ఎమ్మెల్యేపదవే గొప్పదని, ప్రజల రుణం తీర్చుకునేందుకు ఈ ఐదేళ్లూ పనిచేస్తానని ఆయన అన్నారు. ఈ ఐదేళ్లూ తిరుపతి బాగుకోసమే పనిచేస్తానని, తిరుమల శ్రీవారికి ప్రతినిధిగా ఉండటం కంటే పెద్దపదవేమీ ఉండదన్నారు. తాను రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యుడినని తనకు అంతకంటే గౌరవం ఇంకేమీ అక్కర్లేదన్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/