ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా

nara lokesh
nara lokesh


మంగళగిరి: ఐటి శాఖమంత్రి నారాలోకేష్‌ నేడు తాను పోటీ చేసే నియోజకవర్గం మంగళగిరిలో మాట్లాడుతూ.. కార్యకర్తలకు, ప్రజలకు తానెప్పుడూ అందుబాటులో ఉంటానని.. తన వద్ద ఎటువంటి పిఎ వ్యవస్థ లేదని, అందరి ఫోన్‌ కాల్స్‌కి, మెసేజ్‌లకు తానే స్వయంగా సమాధానం ఇస్తానని తెలిపారు. కొందరు కులం, మతం, ప్రాంతం ప్రస్తావన తీసుకొస్తున్నారని విమర్శించారు. మన కులం, మతం, ప్రాంతం అన్నీ మంగళగిరేనని పేర్కొన్నారు. పార్లమెంటులో ఎవరైనా మోదీ పేరు పలకాలంటేనే భయపడతారని, అలాంటిది టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ లోక్‌సభలో మిస్టర్‌ ప్రైమినిస్టర్‌ అంటూ ధైర్యంగా మాట్లాడారని గుర్తు చేశారు. మచ్చలేని కుటుంబాలపై కక్షపూరితంగా కావాలనే కేసులు పెడుతున్నారని లోకేష్‌ ఆరోపించారు.