కోడెల ఎనలేని సేవలు

Balakrishna with Media
Balakrishna with Media

Hyderabad: రాష్ట్రానికి, ప్రజలకు మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఎనలేని సేవలు చేశారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు.  బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శారీరకంగా ఆయన లేకపోయినా మన మనస్సుల్లో ఎప్పటికీ చిరస్మరణీయుడిగా ఉంటారన్నారు. బవసతారకం ఆస్పత్రి నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని బాలకృష్ణ అన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి నిధులు సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. 2000 నుంచి 2009 మధ్యకాలంలో ఈ ఆస్పత్రికి ఛైర్మన్‌గా వ్యవహరించారని గుర్తుచేసుకున్నారు. పలు మంత్రి పదవులు అలంకరించి ప్రజలకు ఎనలేని సేవలందించారన్నారు. నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా తన ముద్ర వేశారని చెప్పారు. ఆయన మృతిని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని బాలకృష్ణ అన్నారు. ఆయన మరణవార్త విన్న వెంటనే సినిమా షూటింగ్‌ రద్దు చేసుకుని వచ్చానని తెలిపారు