గల్లా జయదేవ్‌కు బెయిల్‌ మంజూరు

Jayadev Galla
Jayadev Galla

అమరావతి: ఏపీ రాజధానిని మూడు ప్రాంతాలకు మార్చటంపై టిడిపి ఎంపీ గల్లా జయదేవ్‌ నిన్న నిరసనలకు దిగగా, ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ కేసును పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా నిన్న మధ్యాహ్నం అరెస్టు అయి, ఈ తెల్లవారుజామున గుంటూరు సబ్‌ జైలుకు తరలించబడిన గల్లా జయదేవ్‌కు బెయిల్‌ మంజూరు అయింది. మంగళగిరి మేజిస్ట్రేట్‌ కోర్టులో జయదేవ్‌ తరపు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. మరికాసేపట్లో బెయిల్‌ పత్రాలు గుంటూరు సబ్‌జైలు అధికారులకు అందిస్తామని, ఆపై సాయంత్రంలోగా గల్లా జయదేవ్‌ విడుదల అవుతారని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/